దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ
మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని *మేడ్చల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మేడ్చల్ జిల్లా కురుమ యువ నాయకులు,మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ శ్రీ కౌడే మహేష్ కురుమ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 76వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది.ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం వీరమరణం చెందిన కడవెండి వీరపుత్రుడు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు కీ శే దొడ్డి కొమురయ్య కురుమ గారికి 76 వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు.
దొడ్డి కొమురయ్య ప్రాణత్యాగం ఎన్నో గడీలను కూల్చింది.తెలంగాణ రైతాంగ ఉద్యమానికీ,ఆ తర్వాత అనేక ప్రజాఉద్యమాలకూ,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలకూ దొడ్డి కొమురయ్య పోరాట వారసత్వమే స్ఫూర్తి.కొమరయ్య అమరత్వం రాష్ట్ర ప్రజా పోరాటాల చరిత్రలో విశిష్టమైంది.ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ శ్రీ మర్రి నర్సింహ్మా రెడ్డి గారు,మేడ్చల్ మున్సిపాలిటీ టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్ గారు,మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీ చీర్ల రమేష్ కురుమ గారు,మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్ శ్రీ కౌడే మహేష్ కురుమ గారు,శ్రీ పెంజర్ల స్వామి యాదవ్ గారు,శ్రీ బత్తుల శివ కుమార్ యాదవ్ గారు,శ్రీ మర్రి శ్రీనివాస్ రెడ్డి గారు,శ్రీ జంగా హరికృష్ణ యాదవ్ గారు,శ్రీ అత్వెల్లి సందీప్ గౌడ్ గారు*మ,మేడ్చల్ జిల్లా గొర్రెల మేకల పెంపకదారుల సంఘం కార్యదర్శి శ్రీ ఎక్కాలదేవ్ కొమురయ్య యాదవ్ గారు,మేడ్చల్ మండల కురుమ సంఘం అధ్యక్షులు శ్రీ గౌర్ల ఎర్ర భీరప్ప కురుమ,మేడ్చల్ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు శ్రీ నాచారం బాల మల్లేష్ యాదవ్ గారు,మేడ్చల్ పట్టణ మాజీ వార్డు మెంబర్ శ్రీ కౌడే నాగేందర్ కురుమ గారు,మేడ్చల్ మండల గొర్రెల మేకల పెంపకదారుల సంఘం అధ్యక్షులు శ్రీ సల్ల కృష్ణ యాదవ్ గారు,కౌడే శివ రాకేష్ కురుమ,మాసిని మల్లేష్,ఆంజనేయులు కురుమ,ఈశ్వర్,వెంకటేశం,నాని,రాకేష్,మల్లేష్,ప్రవీణ్,శ్రీధర్,అజయ్,అర్శద్,బిక్షపతి,యాదగిరి,స్వామి,మల్లేష్,శ్రీశైలం,తదితరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment